Johnsson and Johonson: వలంటీర్లకు అనారోగ్యం... ఆగిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్!

Johnson and Johnson Vaccien Trails Stopped

  • నిలిచిపోయిన ఎన్సింబెల్ ట్రయల్స్
  • టీకా తీసుకున్న వ్యక్తికి సమస్యలు
  • 200 దేశాల్లో ఆగిన ట్రయల్స్ ప్రక్రియ

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన కరోనా టీకా ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రయోగ పరీక్షల్లో భాగంగా ఈ టీకాను తీసుకున్న వలంటీర్లకు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

"అన్ని కొవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ నూ నిలిపివేశాము. ఫేజ్ 3 దశలో ఉన్న 'ఎన్సింబెల్' ట్రయల్స్ కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అధ్యయనంలో పాల్గొన్న ఓ వ్యక్తికి అనుకోకుండా సమస్యలు రావడమే ఇందుకు కారణం" అని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన వెలువరించింది.

ఈ చర్యతో ఫేజ్ 3లో భాగంగా 60 వేల మంది వలంటీర్ల నమోదును కూడా సంస్థ నిలిపివేసింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ, ప్రస్తుతానికి ట్రయల్స్ ను నిలిపివేశామని, త్వరలోనే తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఫేజ్ 3 ట్రయల్స్ లో భాగంగా 200 దేశాల్లో 60 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని జాన్సన్ అండ్ జాన్సన్ భావించింది. ఈ ప్రక్రియ మొత్తం ఇప్పటికి నిలిచిపోయినట్టే!

  • Loading...

More Telugu News