Uttar Pradesh: ఏనుగుపై కూర్చుని యోగా చేస్తూ, కిందపడిన బాబా రామ్ దేవ్... వీడియో ఇదిగో!

- యూపీలోని మధురలో ఘటన
- భ్రమరీ ప్రాణాయామం చేస్తుంటే కదిలిన ఏనుగు
- ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న అభిమానులు
ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఏనుగుపై కూర్చుని యోగా చేస్తున్న ఆయన, పట్టుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాకపోవడంతో, అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధురలో జరిగింది.
రామ్ దేవ్ ఏనుగుపై కూర్చుని భ్రమరీ ప్రాణాయామం చేస్తున్న వేళ, ఏనుగు కొద్దిగా కదిలింది. దీంతో ఆయన కిందపడ్డారు. ఆపై తనంతట తనే లేచి, నిర్వాహకులపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.