Sensex: చివరి గంటలో లాభాలను ఆర్జించిన మార్కెట్లు

Sensex ends 169 points high

  • 169 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా నష్టపోయిన ఎన్టీపీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అసలు ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరి గంటలో మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 40,795కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 11,971 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.87%), బజాజ్ ఫైనాన్స్ (3.00%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.34%), టాటా స్టీల్ (2.19%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-4.35%), ఓఎన్జీసీ (-2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.33%), టెక్ మహీంద్రా (-2.18%), ఇన్ఫోసిస్ (-1.89%).

  • Loading...

More Telugu News