Corona Virus: ఏయే బ్లడ్ గ్రూప్ లపై కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..!
- ఓ, బి బ్లడ్ గ్రూపు వ్యక్తుల్లో తక్కువ కరోనా వ్యాప్తి
- ఏ, ఏబీ గ్రూపుల్లో వేగంగా విస్తరణ
- కరోనా మరణాలు కూడా ఈ గ్రూపుల్లోనే అధికం
నెలలు గడుస్తున్నా కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. కోరలు చాస్తూ విస్తరిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఈ వైరస్ పై ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రిటీష్ కొలంబియా, డెన్మార్క్ లోని ఒడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ లు విడివిడిగా చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఓ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో అతి తక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఈ పరిశోధనల్లో తేలింది. అయితే ఓ గ్రూప్ వ్యక్తులు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారని, బి బ్లడ్ గ్రూప్ వ్యక్తులు స్వల్ప చికిత్సతో బయటపడొచ్చని పరిశోధనలు తెలిపాయి. ఏ, ఏబీ బ్లడ్ గ్రూపు వ్యక్తుల్లో మాత్రం కరోనా వేగంగా విస్తరిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ కరోనా మరణాలు కూడా ఏ, ఏబీ గ్రూపుల్లోనే సంభవిస్తున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రూపుల వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచించారు.