Cyberabad Piolice: చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటుంది... సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వీడియో ఇదిగో!

 Cyberabad traffic police shares a video and quoted Newton Third Law

  • ఓ ఆకతాయి చేష్టపై పోలీసుల కామెంట్
  • పశువును కాలితో తన్ని తానే కిందపడిపోయిన ఆకతాయి
  • న్యూటన్ మూడవ నియమాన్ని ఉదాహరించిన పోలీసులు

భౌతికశాస్త్రంలో న్యూటన్ గతిజ సూత్రాలు, గమన నియమాలు ఎంతో ముఖ్యమైనవి. చర్య ఎంత బలంగా ఉంటే ప్రతి చర్య అంతే బలంతో ఉంటుందన్నది వీటిలో న్యూటన్ మూడో సూత్రంగా పేర్కొంటారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో పోస్టు చేసి న్యూటన్ మూడవ గమన నియమాన్ని ఉదాహరించారు. మీరు ఫిజిక్స్ క్లాసులో నిద్రపోయి న్యూటన్ మూడవ గమన నియమాన్ని వినలేదా... అయితే ఈ వీడియో చూడండి, అచ్చం ఇలాగే జరుగుతుంది అంటూ ట్వీట్ చేశారు.

ఇంతకీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే... ఇద్దరు కుర్రాళ్లు బైక్ వెళుతుండగా... వారిలో వెనుక కూర్చున్న ఆకతాయి రోడ్డుపై ఉన్న పశువును కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. కాలితో తన్నే ప్రయత్నంలో బాగా కదలడంతో బండి కుదుపులకు లోనైంది. పశువును తన్నిన కుర్రాడు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోగా, బైక్ నడుపుతున్న కుర్రాడు బైక్ ను స్తంభానికి ఢీకొట్టి తాను కూడా కిందపడిపోయాడు. చర్యకు ప్రతి చర్య ఇలా ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News