Flood: హైదరాబాదులో వర్షం పడుతుంటే వరద ఎలా పెరిగిందో చూపుతున్న సీసీటీవీ వీడియో!
- వరద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో
- 2 గంటల వ్యవధిలోనే నీట మునిగిన ఇళ్లు
- వైరల్ అవుతున్న వీడియో
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్నో కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరుచేరగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలనీల్లోకి వరద నీరు ఎలా చేరిందో, నిమిష నిమిషానికీ ఎలా పెరిగిందో తెలియజెప్పే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో వరద వీడియోను సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. హఫీజ్ బాబా నగర్, ఒమర్ కాలనీ, ఫూల్ బాగ్, ఇందిరా నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలోనే వరద నీరు భారీగా వచ్చి చేరింది. అక్టోబర్ 18 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇళ్లలోకి చేరిన వరద నీటి వీడియోను మీరూ చూడవచ్చు.