Amarinder Singh: పంజాబ్ ముఖ్యమంత్రి కుమారుడికి ఈడీ సమన్లు

ED issues summons to Punjab CM Amarinder Singhs son

  • అక్రమ విదేశీ నిధుల కేసులో సమన్లు
  • 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుమారుడు రణీందర్ సింగ్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ విదేశీ నిధుల కేసులో సమన్లను అందించింది. ఈ విషయాన్ని రణీందర్ లాయర్ జైవీర్ షెర్గిల్ వెల్లడించారు.

తన క్లయింట్ రణీందర్ కు సమన్లు వచ్చాయని చెప్పారు. తన క్లయింట్ చట్టానికి కట్టుబడిన వ్యక్తి అని అన్నారు. ఇది చాలా పాత కేసు అని... చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తామని, అయితే సమన్లు జారీ చేసిన సమయం మాత్రం పలు ప్రశ్నలకు తావిచ్చేలా ఉందని చెప్పారు. ఈ నెల 27న తమ ముందు హాజరు కావాలని తన సమన్లలో ఈడీ పేర్కొంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో సమన్లను జారీ చేసింది.

  • Loading...

More Telugu News