Mirzapur 2: నగర ప్రతిష్ఠను మంటకలుపుతోంది.. 'మీర్జాపూర్ 2' వెబ్ సీరీస్ ను బ్యాన్ చేయండి: ఎంపీ అనుప్రియ పటేల్
- మీర్జాపూర్ సామరస్యానికి ప్రతీక
- ఈ షో జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోంది
- దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి
వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్ 2’ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని, దీనిని వెంటనే నిషేధించాలని మీర్జాపూర్ అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. మీర్జాపూర్‌ను హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ నగర ప్రతిష్ఠను మంట కలిపేలా ఉందని ఆరోపించారు.
ఈ సీరీస్ పేరు మీర్జాపూరే అయినా, ఓ పక్క దానిని హింసాత్మక నగరంగా చూపించారని, మరోపక్క జాతి అసమానతలు పెరిగేలా ఈ షో ఉందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. శాంతి, సామరస్యాలకు ఈ నగరం కేంద్ర బిందువులా ఉందని అన్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ విషయంలో దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అనుప్రియ కోరారు.