Imran Khan: ఫేస్ బుక్ సీఈవోకు ఇమ్రాన్ ఖాన్ లేఖ

Imran Khan Writes To Facebook CEO Seeking Ban On Islamophobic Content

  • ఇస్లాం వ్యతిరేక కంటెంట్ పై బ్యాన్ విధించండి
  • లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి
  • ఇది హింసను ప్రేరేపిస్తుంది

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ని బ్యాన్ చేయాలని లేఖలో కోరారు. ఇస్లామిక్ ప్రపంచానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున సమాచారం షేర్ అవుతోందని... ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని, హింసను ప్రేరేపిస్తుందని చెప్పారు. విద్వేషాలకు, వినాశనాలకు కారణమయ్యే వాటిపై మీరు ఇప్పటికే నిషేధం విధించారని... అదే మాదిరి ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ని బ్యాన్ చేయాలని కోరారు.

మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను విద్యార్థులకు చూపిస్తున్నాడనే కారణంతో ఫ్రాన్స్ లో ఒక ఉపాధ్యాయుడిని ఇస్లామిక్ అతివాదులు హత్య చేసిన నేపథ్యంలో ఆయన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆ దేశాధ్యక్షుడు ఎమాన్యుయేల్ మక్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కార్టూన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని మక్రాన్ అన్నారు. దీంతో, ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు ముస్లింలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఇదే క్రమంలో జుకర్ బర్గ్ కు కూడా ఆయన లేఖ రాశారు.

  • Loading...

More Telugu News