Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ.. ఈ విషయాన్ని తెగేంత వరకు లాగకండి: వర్ల రామయ్య

varla slams jagan

  • ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది
  • గతంలో, పాక్‌లో రెండు వ్యవస్థల మధ్య వైరం 
  • అది పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సర్కారు, ఎన్నికల కమిషన్ మధ్య ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సమావేశానికి రావాలంటూ ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తాజాగా ఫోన్ మెసేజ్ రావడం, దానిపై ఎన్నికల కమిషనర్ మండిపడడం తెలిసిందే. అంతకుముందు ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య చోటు చోటుచేసుకున్న పరిణామాలు అలజడి రేపాయి.

ఈ నేపథ్యంలో వర్ల రామయ్య వీటిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ‘ముఖ్యమంత్రి గారూ.. రాష్ట్రంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది. చూస్తుంటే, ఈ వ్యవస్థల తీరు, గతంలో, పాకిస్థాన్ లో ముషారఫ్ టైమ్ లో రెండు వ్యవస్థల మధ్య వైరం పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెగేoత వరకు లాగకండి’ అని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News