Vijay Sai Reddy: గీతం వర్సిటీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు విజయసాయిరెడ్డి లేఖ 

YCP MP Vijayasai Reddy writes to Union Education Minister Ramesh Pokhriyal

  • గీతం వర్సిటీ యూజీసీ నిబంధనలు అతిక్రమించిందని ఆరోపణ
  • విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఇటీవలే విశాఖలో గీతం నిర్మాణాల తొలగింపు

ఇటీవలే విశాఖ గీతం విద్యాసంస్థల ప్రాంగణంలో పలు నిర్మాణాలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను కూడా అతిక్రమించిందని లేఖలో ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. గీతం యూనివర్సిటీకి ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ రద్దు చేసే అవకాశం ఉందని, విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధంగా చేయొచ్చని పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి అంతకుముందు గీతం వర్సిటీ వ్యవహారంపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) చైర్మన్ సురేశ్ చంద్రకు కూడా లేఖ రాశారు. నకిలీ డాక్యుమెంట్లతో గుర్తింపు పొందినట్టు అనేక ఫిర్యాదులు ఉన్నాయని తన లేఖలో తెలిపారు. పూర్వం ఉన్న భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆ డాక్యుమెంట్లను సరిగా తనిఖీ చేసిందా? లేదా? అనేది సందేహమేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News