Sensex: మధ్యలో లాభాల్లోకి వెళ్లినా.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
- 172 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతం వరకు నష్టపోయిన ఎల్ అండ్ టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. మధ్యలో ఒకసారి లాభాల్లోకి వెళ్లినా.. చివరకు నష్టాలు తప్పలేదు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో వారు ఆచితూచి ట్రేడింగ్ చేస్తున్నారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 172 పాయింట్లు నష్టపోయి 39,749కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 11,670 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (2.79%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.24%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.21%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.95%).
టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-4.99%), టైటాన్ కంపెనీ (-3.32%), ఓఎన్జీసీ (-2.94%), ఎన్టీపీసీ (-1.87%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.84%).