Devineni Uma: ఇది మీ ప్రభుత్వ అసమర్థత కాదా?: దేవినేని ఉమ

devineni uma slams jagan

  • పట్టిసీమకట్టి 370 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ కి పంపారు చంద్రబాబు
  • పురుషోత్తమ పట్నం కట్టి ఏలేరుకి, విశాఖకు పంపారు
  • మచ్చుమర్రి ద్వారా అనంతపురానికి కృష్ణాజలాలు
  • నేడు ప్రాజెక్టు పూర్తి డీపీఆర్ సమర్పించి అధ్యయనం జరగాలంటున్నారు

పర్యావరణ అనుమతులు పొందకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని వైసీపీ సర్కారుని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించిన విషయానికి సంబంధించిన వార్తలను పోస్ట్ చేస్తూ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ముందస్తు అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడాన్ని నిషేధిస్తున్నట్లు నిన్న ఎన్జీటీ ప్రకటించిన అంశాన్ని దేవినేని ఉమ ప్రస్తావించారు.  

‘సముద్రంలోకెళ్లే గోదావరి జలాలను పట్టిసీమకట్టి 370 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ కి, పురుషోత్తమ పట్నం కట్టి ఏలేరుకి, విశాఖకి చంద్రబాబు నాయుడు పంపారు. మచ్చుమర్రి ద్వారా అనంతపురానికి కృష్ణాజలాలు అందించారు. నేడు ప్రాజెక్టు పూర్తి డీపీఆర్ సమర్పించి అధ్యయనం జరగాలంటున్నారు. ఇది మీ ప్రభుత్వ అసమర్థత కాదా? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News