KTR: గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీలో కేటీఆర్ సందడి... ఫొటోలు ఇవిగో!

KTR and Srinivas Goud inaugurates Gutta Jwala academy in Moinabad
  • బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పిన జ్వాల
  • జ్యోతి ప్రజ్వలన చేసిన కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్
  • అకాడమీ చిన్నారులతో కేటీఆర్ మాటామంతి
ప్రముఖ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఔత్సాహిక ఆటగాళ్లను సానబట్టేందుకు అకాడమీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. హైదరాబాదు శివారు ప్రాంతం మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ఇవాళ తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిరువురు జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం కేటీఆర్ తదితరులకు గుత్తా జ్వాల తమ అకాడమీలోని వివిధ విభాగాలను చూపించారు. అకాడమీలో ఏర్పాటు చేసిన జిమ్, క్రీడా ఉపకరణాల స్టాల్ ను మంత్రులు సందర్శించారు. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులతో కేటీఆర్ ముచ్చటించారు.  ఆపై సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. కాగా, ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల తండ్రి క్రాంతి కూడా పాల్గొన్నారు.
KTR
Gutta Jwala Badminton Academy
V Srinivas Goud
Moinabad
Hyderabad

More Telugu News