China: భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్!
- రైల్వే లైన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం
- యాన్-లింజీ నగరాల మధ్య తగ్గనున్న దూరం
- త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం
చైనా ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్తగా రైల్వే లైన్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే సిచువాన్-టిబెట్ రైల్వే మార్గంలో నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నుంచి టిబెట్‌లోని లింజీ వరకు ఈ కొత్త రైల్వే లైన్‌ను నిర్మించనుంది.
కొత్త లైన్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రెండు సొరంగాలు, బ్రిడ్జి, విద్యుత్ సరఫరా ప్రాజెక్టులను నిర్మించనుంది. సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డూలో ప్రారంభమయ్యే ఈ లైన్ లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే యాన్-లింజీ నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది.