Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 506 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 144 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 6 శాతానికి పైగా పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు... చివరి వరకు అదే జోష్ ను కొనసాగించాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో తయారీ రంగం పుంజుకుంటోందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 504 పాయింట్లు లాభపడి 40,261కి పెరిగింది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 11,814 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (6.51%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (4.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.02%), సన్ ఫార్మా (3.39%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-3.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.48%), నెస్లే ఇండియా (-1.08%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.94%).