North Korea: ఉత్తర కొరియాకు లగ్జరీ వస్తువులు ఎగుమతి చేసిన సింగపూర్ వ్యాపారికి జైలు శిక్ష

singapure court fines bussiness man

  • ఉత్తరకొరియాకు వస్తువుల ఎగుమతిపై ఆంక్షలు
  • అయినప్పటికీ అక్రమంగా తరలింపు
  • భారీగా జరిమానా కూడా విధించిన కోర్టు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీరు వల్ల వివిధ దేశాలు ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగించవన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం పట్ల కూడా ఆయా దేశాల్లో ఆంక్షలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో సింగపూర్‌కి చెందిన వ్యాపారి చాంగ్‌ హాక్‌ యెన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తరకొరియాకు కోట్లాది రూపాయల విలువ చేసే లగ్జరీ వస్తువులను ఎగుమతి చేశాడు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సింగపూర్ లోని కోర్టు ఆయన చేసిన నేరానికి జైలు శిక్షవిధించడమే కాకుండా, ఆయన సంస్థలకు భారీగా జరిమానా కూడ విధించింది. ఆ వ్యాపారి సింగపూర్‌లోని సీఎస్‌ఎన్‌ సింగపూర్‌, బీఎస్‌ఎస్‌ గ్లోబల్‌, గున్నర్‌ సింగపూర్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉండేవాడు.

వాటి ద్వారానే పర్‌ఫ్యూమ్స్‌, ఖరీదైన గడియారాల వంటివి ఉత్తర కొరియాకు అక్రమంగా ఎగుమతి చేశారు. ఆయన ఎగుమతి చేసిన వాటి విలువ రూ. 3.12కోట్లు ఉంటుందని, 2010 నుంచి 2016 మధ్య ఆయన వాటిని పంపారని తేలింది. 2017లో ఆయనపై కేసు నమోదు కాగా, తాజాగా నేరం నిరూపితమై శిక్షపడింది.

  • Loading...

More Telugu News