Raghu Rama Krishna Raju: ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉంటే మా వైసీపీ గెలవడం కష్టమే: రఘురామకృష్ణరాజు

YSRCPs victory is difficult until Nimmagadda is SEC says Raghu Rama Krishna Raju

  • కరోనా సమయంలో పాఠశాలలు తెరిచారు
  • ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం ఏమిటి?
  • కోర్టులతో పదేపదే మొట్టికాయలు వేయించుకోవద్దు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలను తెరిచినప్పుడు... స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచినప్పుడు కరోనా నిబంధనలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ఉన్నంత వరకు ఎన్నికలను నిర్వహించేందుకు తమ వైసీపీ ప్రభుత్వం ఆసక్తి చూపదని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరగవనే భయం మా పార్టీలో ఉందని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని... ఏపీలో ఎన్నికలకు అభ్యంతరం ఎందుకని రఘురాజు ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎన్నికల సంఘానికి సహకరించాలని చెప్పారు. కోర్టులతో పదేపదే మొట్టికాయలు వేయించుకోవద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నదానిపై స్పష్టత తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News