Arvind Kejriwal: ఢిల్లీలో కరోనా థర్డ వేవ్: కేజ్రీవాల్
- కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి
- రేపు దీనిపై సమీక్ష నిర్వహిస్తాం
- కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. దీన్ని మనం కరోనా థర్డ్ వేవ్ అనొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి రేపు సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా 80 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు కేటాయించాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. శీతాకాలంలో వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల... దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించే అంశంపై కూడా ఆలోచిస్తున్నామని అన్నారు.