Sensex: బైడెన్ గెలుస్తాడనే అంచనాలతో దూసుకుపోయిన మార్కెట్లు

Sensex ends 724 points high

  • 724 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 212 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ, టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత అదే ఊపును కొనసాగిస్తూ... చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. ఫిబ్రవరి 14 తర్వాత మార్కెట్లు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలవబోతున్నారనే అంచనాలతో మార్కెట్లు జోష్ లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  724 పాయింట్లు లాభపడి 41,340కి పెరిగింది. నిఫ్టీ 212 పాయింట్లు పుంజుకుని 12,120కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని స్టాకులు లాభాలను ఆర్జించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.63%), టాటా స్టీల్ (5.34%), బజాజ్ ఫైనాన్స్ (4.95%), బజాజ్ ఫిన్ సర్వ్ (4.15%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.46%) టాప్ లూజర్లుగా నిలిచాయి.

  • Loading...

More Telugu News