car: బానెట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్.. కారును ముందుకు పోనిచ్చేసిన డ్రైవర్.. వీడియో ఇదిగో
- మహారాష్ట్రలోని పూణె, పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో ఘటన
- మాస్కులు లేకుండా ప్రయాణం
- పోలీసులు చెక్ చేస్తుండగా ఘటన
- కారు డ్రైవర్ అరెస్టు
కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తోన్న వారిని ట్రాఫిక్ పోలీసులు ఆపి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీసు ఓ కారును ఆపాడు. దీంతో డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోతూ కారును ఆపకుండా ముందుకు తీసుకుపోయాడు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి ఉండడంతో బానెట్‌పైకి ఎక్కాడు. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు.
ఈ విషయాన్ని గుర్తించిన ద్విచక్రవాహనదారుడు ఆ కారును వెంబడించాడు. చివరకు ఆ కారు డ్రైవర్ కారును ఆపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్ఫోన్లలో వీడియో తీశారు. మహారాష్ట్రలోని పూణె, పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అబాసాహెబ్ సావంత్ కాలుకి గాయమైంది.