Donald Trump: ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారంటూ ట్రంప్ ట్వీట్... తొలగించి షాకిచ్చిన ట్విట్టర్!

Trump Tweet Removed by twitter

  • ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాలు
  • వివాదాస్పద ట్వీట్లను ఉంచబోమన్న ట్విట్టర్
  • అదే వ్యాఖ్య పోస్ట్ ను తొలగించిన ఫేస్ బుక్

అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరిగి, ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ, ప్రత్యర్థి బైడెన్ టీమ్, తన విజయాన్ని దొంగిలించాలని చూస్తోందని చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది.

 "మనమే ముందున్నాం. అయితే, వారు ఈ ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారు. దాన్ని జరుగనివ్వబోము. ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్లను వేయనిచ్చేది లేదు" అని వ్యాఖ్యానించారు. ఇక ఈ ట్వీట్ వివాదాస్పదమైనదని, పౌర సమాజంలో జరుగుతున్న ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు పంపించేలా ఉందని అభిప్రాయపడ్డ ట్విట్టర్, దాన్ని తొలగించింది.

కాగా, ట్విట్టర్ గతంలో సైతం కొన్ని ట్రంప్ ట్వీట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇక ట్రంప్ తాజా ట్వీట్, ఫేస్ బుక్ ఖాతాలో సైతం పెట్టగా, ఫేస్ బుక్ యాజమాన్యం సైతం ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది."తొలి దశ ఓట్ల లెక్కింపుతో పోలిస్తే, తుది ఫలితం వేరుగా ఉండవచ్చు. ఓట్ల లెక్కింపుకు రోజులు, వారాల సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు" అని ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది. ఆ తరువాత విజయం తనదేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సైతం ఫేస్ బుక్ ఫ్లాగ్ చేసింది.

  • Loading...

More Telugu News