putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనారోగ్యం.. పదవి నుంచి తప్పుకునే అవకాశం?

putin may be resigned

  • పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న పుతిన్
  • పదవీ బాధ్యతలను నిర్వర్తించడం మంచిది కాదన్న వైద్యులు
  • తప్పుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులు
  • తప్పుకుంటారా? అన్న సందేహాలూ వ్యక్తం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (68)‌ ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు రష్యాలోని ఓ పత్రిక ఓ కథనంలో తెలిపింది.  మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినే పార్కిన్సన్స్ ‌ వ్యాధితో ఆయన బాధపడుతున్నారని చెప్పింది. దీంతో అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వర్తించడం మంచిది కాదని ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు ఆయనకు సలహా ఇస్తున్నారు. అనారోగ్యం బారినపడ్డప్పటికీ, ఆయన తన పని తాను చేస్తున్నారు.  

అయితే, భవిష్యత్‌లో వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనను  కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పకుండా రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 2021 జనవరిలో పుతిన్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు రష్యా మీడియా తెలిపింది.

మరోవైపు రాజకీయ రంగ విశ్లేషకులు మాత్రం పుతిన్ ఆ పదవి నుంచి తప్పుకోబోరనే అభిప్రాయపడుతున్నారు. తాను బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న ఆకాంక్ష పుతిన్ కు ఉంది. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు కూడా తీసుకువచ్చారు. అంతగా ఆ పదవిపై ఆశ ఉన్న పుతిన్ వ్యాధి కారణంగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా? అన్న సందేహాలూ మరోపక్క వ్యక్తమవుతున్నాయి.  

  • Loading...

More Telugu News