Jagan: వర్చువల్ విధానంలో 'ప్రజాశక్తి' పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan inaugurates Praja Sakthi office via virtual mode
  • తాడేపలిలో ప్రజాశక్తి నూతన భవనం ప్రారంభం
  • ప్రజాశక్తి యాజమాన్యానికి, సిబ్బందికి విషెస్ తెలిపిన సీఎం జగన్
  • ప్రజాశక్తి కార్యాలయంలో ఎడిటర్ అధ్యక్షతన సభ
సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రజాశక్తి దినపత్రిక నూతన కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ఈ కార్యాలయ భవనాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తి యాజమాన్యానికి, పత్రికా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని, ప్రజాశక్తి పత్రిక ఎడిటర్ ఎంవీఎస్ శర్మ, సీపీఎం నేతలు బీవీ రాఘవులు, పి. మధు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తాడేపల్లి ప్రజాశక్తి భవనం ప్రారంభోత్సవం అనంతరం ఎడిటర్ ఎంవీఎస్ శర్మ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి పత్రికా ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు.
Jagan
Praja Sakthi
Office
Inauguration
Virtual
Tadepalli

More Telugu News