Sensex: వారాంతాన్ని భారీ లాభాల్లో ముగించిన మార్కెట్లు

Sensex closes 553 points high

  • 553 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • రెండున్నర శాతం వరకు నష్టపోయిన మారుతి సుజుకి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో... మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553 పాయింట్లు పెరిగి 41,893కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 12,264 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.78%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.01%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.54%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.65%), భారతి ఎయిర్ టెల్ (-1.67%), ఏసియన్ పెయింట్స్ (-1.34%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.24%), నెస్లే ఇండియా (-1.22%).

  • Loading...

More Telugu News