Kodali Nani: స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీలేదు: కొడాలి నాని
- ప్రత్యేక అధికారులతో స్థానిక పాలన కొనసాగుతుందని వెల్లడి
- కేంద్రం నిధులు ఇస్తుందని వివరణ
- న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న మంత్రి
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై స్పందించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారులతో స్థానిక పాలన కొనసాగుతుందని, స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇస్తుందని వివరించారు. అయినా ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తే ఎవరికి నష్టమో చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పాలని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే ఉద్యోగులు కూడా ఆసక్తిగా లేరని కొడాలి నాని స్పష్టం చేశారు. తమకు ఎన్నికలు ముఖ్యం కాదని అన్నారు.