Donald Trump: ఓటమికి చేరువైన నేపథ్యంలో బైడెన్‌పై ట్రంప్‌ మరోసారి ఆరోపణలు!

trump  slams biden

  • ఇంకా కొనసాగుతోన్న కౌంటింగ్
  • కౌంటింగులో అక్రమాలు జరుగుతున్నాయని ట్రంప్ ఆరోపణ
  • తప్పుడు మార్గంలో ప్రయత్నాలు జరపొద్దని హితవు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమి దిశగా పయనిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ తన పత్యర్థి జో బైడెన్‌పై ఇంకా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా మరోసారి స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో తప్పుడు మార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ప్రయత్నాలు జరపొద్దని అన్నారు.  

కాగా, ఫలితాలపై బైడెన్ మట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పారు. ట్రంప్‌పై 4 మిలియన్ల ఓట్ల తేడాతో గెలుస్తామని తెలిపారు. రాజకీయాలు ఉండేవి సమస్యల పరిష్కారాల కోసమేనని చెప్పుకొచ్చారు. తాము ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారమే అయినప్పటికీ రిపబ్లికన్లకు శత్రువులం మాత్రం కాదని వ్యాఖ్యానించారు. తాము కరోనా నివారణకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఫలితాలు అన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు.

మరోవైపు, ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన జార్జియా, పెన్సిల్వేనియాలోనూ తిరిగి బైడెన్ ఆధిక్యంలోకి రావడంతో ట్రంప్ ఓటమి దాదాపు ఖరారైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News