Sensex: మార్కెట్లపై బైడెన్ ఎఫెక్ట్.. దూసుకుపోయిన సెన్సెక్స్

Sensex closes 704 points higher

  • 704 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 197 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఐదున్నర శాతానికి పైగా పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ భారీ మెజార్టీ సాధించడంతో ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. మన మార్కెట్లు కూడా ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే దూసుకెళ్లాయి. దాదాపు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 704 పాయింట్లు లాభపడి 42,597కి పెరిగింది. నిఫ్టీ 197 పాయింట్లు పుంజుకుని 12,461కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.63%), భారతి ఎయిర్ టెల్ (5.30%), యాక్సిస్ బ్యాంక్ (4.34%), టాటా స్టీల్ (2.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.88%).      

ఇక బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐటీసీ (-0.72%), మారుతి సుజుకి (-0.49%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

  • Loading...

More Telugu News