PIB: డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. వివరణ ఇచ్చిన కేంద్రం

There is no lockdown again in India says PIB

  • ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
  • అందులో ఏమాత్రం నిజం లేదన్న పీఐబీ
  • మార్ఫ్‌డ్ ఇమేజ్ అంటూ ట్వీట్

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధమైందంటూ  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. గతంలోనూ ఇటువంటి ప్రచారమే జరిగింది. అప్పుడు కూడా వివరణ ఇచ్చిన కేంద్రం.. తాజా పుకార్లపై మరోమారు స్పష్టమైన వివరణ ఇచ్చింది.

ఆ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏదీ విడుదల కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ).. మార్ఫ్‌డ్ ఇమేజ్ అంటూ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  ట్వీట్‌ను పోస్టు చేసింది. మళ్లీ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తేల్చి చెప్పింది. కాగా, దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు అమలవుతున్నాయి.

  • Loading...

More Telugu News