Flight: ఆస్ట్రేలియాలో కోహ్లీ టీమ్ ఉన్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో విమానం క్రాష్!

  • రెండు రోజుల క్రితం సిడ్నీ చేరుకున్న టీమిండియా
  • ఆటగాళ్లున్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం
  • విమానంలోని ఇద్దరూ బయటపడ్డారన్న మీడియా
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు టీమ్, తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. భారత టీమ్ బస చేసి వున్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఓ విమానం కుప్పకూలింది. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది.

ఆటగాళ్లంతా ప్రమాదం జరిగిన సమయంలో సిడ్నీలోని క్రీడా మైదానంలోనే ఉన్నారు. వీరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రామర్ పార్క్ లో విమానం కూలింది. అదృష్టవశాత్తూ, విమానంలోని ఇద్దరూ గాయాలతో బయటపడ్డారని 'స్టఫ్ డాట్ కో డాట్ ఎన్జడ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

కాగా, రెండు రోజుల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం వచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా, స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టుతో తొలుత మూడు వన్డేలు ఆడనుంది. ఆపై టీ-20 సీరీస్, టెస్ట్ సీరీస్ కూడా సాగనుందన్న సంగతి తెలిసిందే.
Flight
Sydney
Virat Kohli
Flight Accident

More Telugu News