Telangana: గ్రేటర్ ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేస్తాం: జనసేన

Janasena will contest up to 60 seats in GHMC Elections

  • ప్రకటించిన ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్
  • ఒంటరిగానే బరిలోకి దిగనున్న జనసేన
  • బ్యాలెట్ పద్ధతిలోనే జరగనున్న ఎన్నికలు

వచ్చే నెలలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అన్న జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ నేడు వెల్లడించింది. 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్ తెలిపారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగుతాయని భావించినప్పటికీ, రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ఏపీకే పరిమితమని, తెలంగాణలో వేర్వేరుగానే పోటీ పడనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో జనసేన నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ కూడా నిన్న విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిన్న ఉదయం పదిన్నర గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబరు 1న ఓటింగ్ జరగనుండగా, 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, అవసరమైన చోట 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుండగా, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News