Sensex: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Sensex loses 580 points

  • 580 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 166 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఐటీ, ఫైనాన్స్ స్టాకులకు అమ్మకాల ఒత్తిడి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. గత నాలుగు సెషన్లుగా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈరోజు తిరోగమనంలో పయనించాయి. ఐటీ, ఫైనాన్స్ స్టాకుల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 580 పాయింట్లు నష్టపోయి 43,599కి పడిపోయింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 12,771 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.78%), ఐటీసీ (2.15%), ఎన్టీపీసీ (1.59%), టాటా స్టీల్ (1.20%), టైటాన్ కంపెనీ (0.77%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.11%), యాక్సిస్ బ్యాంక్ (-4.06%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.18%), బజాజ్ ఫైనాన్స్ (-2.80%).

  • Loading...

More Telugu News