Australia: అబద్ధం చెప్పిన పిజ్జా డెలివరీ బాయ్.. ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రంలో అలజడి

ruckus in australia

  • సౌత్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో ఘటన
  • పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా
  • పిజ్జా షాప్‌లో పని చేస్తున్నట్లు బయటకు చెప్పని వ్యక్తి
  • పిజ్జా కొనుక్కునేందుకు షాప్‌కు వెళ్లానని అబద్ధం
  • కరోనా వ్యాప్తిని ట్రేస్ చేయలేక లాక్‌డౌన్

ఓ పిజ్జా డెలివరీ బాయ్ తాను చేస్తోన్న ఉద్యోగం గురించి బయటకు చెప్పుకోలేక ఓ అబద్ధం ఆడడంతో ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రమంతా కలకలం చెలరేగింది. సౌత్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో విదేశీయులు ఐసోలేషన్‌లో ఉండే ఓ హోటల్‌‌లో ఓ వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవల కరోనా నిర్ధారణ అయింది.  దీంతో ఆ హోటల్‌లో ఉంటోన్న విదేశీయులు ఆందోళన చెందారు.

కరోనా చైన్ ను అరికట్టే పనిలో భాగంగా అతడు ఎక్కడికి వెళ్లాడనే విషయాన్ని అధికారులు తెలుసుకోవాలానుకున్నారు. అతడు ఎవరెవరిని కలిశాడు వంటి విషయాలపై ఆరా తీశారు.
దీంతో తాను ఓ ప్రముఖ పిజ్జా బార్‌లో పిజ్జా కొనడానికి వెళ్లాలని చెప్పాడు. ఆ షాపులోని వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని చెప్పాడు.

దీంతో అతడికి ఎవరి నుంచి కరోనా సోకిందో తెలుసుకునే వీలు లేకపోవడంతో ఆ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించారు. అధికారులు ఆ కేసును ట్రేస్ చేసే క్రమంలో ఓ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. కరోనా సోకిన ఆ వ్యక్తి ఓ పిజ్జా పార్లర్‌లో పార్ట్ టైమ్ జాబ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

పిజ్జా డెలివరీ బాయ్‌గా తాను చేస్తోన్న ఉద్యోగాన్ని చెప్పుకోవడానికి అతడు సిగ్గుపడి పిజ్జా కొనడానికి వెళ్లానని అసత్యం చెప్పాడని నిర్ధారించుకున్నారు. చివరకు పిజ్జా పార్లర్‌లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు వల్ల అతడికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తేల్చారు. దీంతో వెంటనే లాక్‌డౌన్‌ను రద్దు చేశారు.  అతడు చెప్పిన అబద్ధం రాష్ట్రం మొత్తం అలజడి రేపిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


  • Loading...

More Telugu News