Andhra Pradesh: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగినని నమ్మించి వివాహం.. ఆపై భార్య నగ్నవీడియోలతో వ్యాపారం!
- గుంటూరులో ఘటన
- తాను చెప్పిన వారి వద్దకు వెళ్లకుంటే తలను గోడకు గుద్దుకుని చనిపోతానని బెదిరింపు
- ఏకాంత వీడియోలను లైవ్‌లో పెట్టి డబ్బులు సంపాదన
- సైబర్ నిపుణుల సాయంతో వీడియోలను తొలగిస్తున్న పోలీసులు
ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగినని నమ్మించి ఓ యువతిని పెళ్లాడిన యువకుడు, ఆపై డబ్బు సంపాదన కోసం వక్రమార్గం పట్టాడు. భార్య నగ్న ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవాడు. అలాగే, పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేసేవాడు. అతడి వికృత చేష్టలు మితిమీరడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అతడి దారుణాలు వెలుగుచూశాయి. గుంటూరులో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం గుంటూరుకు చెందిన ఓ యువతిని నిందితుడు వివాహం చేసుకున్నాడు. తాను ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి భారీగా కట్నకానులకు తీసుకున్నాడు. భర్త ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కావడంతో విమానాశ్రయానికి తీసుకెళ్లాలని, విమానాలు చూపించాలని భార్య తరచూ అడిగేది. దీంతో అసలు విషయం బయటపెట్టాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదని తేల్చిచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపాయి. పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు.
ఆ తర్వాత ఓ కొరియర్ సంస్థ పెట్టి నష్టపోయిన నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని, తన మాట వినకుంటే తలను గోడకు బాదుకుని చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు.
దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పరాయి వ్యక్తుల వద్దకు వెళ్లి డబ్బులు సంపాదించాలని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పింది. దీంతో ఆమె భర్తను పిలిపించిన పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి. భార్య నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగ్న ఫొటోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవాడినని, వాటికి ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
అలాగే, భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోలను యూట్యూబ్, యాప్‌లలో లైవ్‌లో చూపించి డబ్బులు సంపాదించేవాడు. ఆ వీడియోలు చూసి తనను సంప్రదించిన వారి వద్దకు వెళ్లాలంటూ భార్యను బలవంతం చేసేవాడు. అతడు పెట్టే మానసిక హింసను భరించలేని ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నిపుణుల సాయంతో యూట్యూబ్‌లో అతడు అప్లోడ్ చేసిన వీడియోలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.