Sensex: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends in profits amid volatile trading

  • మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయనే భయాలు
  • మధ్యాహ్నం వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు
  • చివరకు 195 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో, మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయనే భయాలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఊహించిన దానికంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో మార్కెట్లు మళ్లీ పుంజుకుని, చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 44,077కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 12,926 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (6.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.79%),  ఇన్ఫోసిస్ (3.37%), టెక్ మహీంద్రా (2.98%), టీసీఎస్ (2.42%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.55%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.48%), యాక్సిస్ బ్యాంక్ (-1.99%), టైటాన్ కంపెనీ (-1.74%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.69%).

  • Loading...

More Telugu News