Sensex: బైడెన్ కు లైన్ క్లియర్ కావడంతో దూసుకుపోయిన మార్కెట్లు.. తొలి సారి 13 వేల మార్కును దాటిన నిఫ్టీ

Nifty crosses 13K for the first time in history

  • 446 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 128 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
  • కరోనా వ్యాక్సిన్ వార్తలతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందనే వార్తలతో పాటు ... జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు ట్రంప్ మార్గం సుగమం చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, నిఫ్టీ చరిత్రలో తొలిసారి 13 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు ఎగబాకి 44,523కి పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 13,055కు చేరుకుంది. టెలికాం మినహా అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (4.02%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.14%), ఐటీసీ (2.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.16%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.47%), టైటాన్ కంపెనీ (-1.36%), నెస్లే ఇండియా (-0.63%), భారతి ఎయిర్ టెల్ (-0.61%), ఓఎన్జీసీ (-0.59%).

  • Loading...

More Telugu News