West Bengal: బీజేపీలో చేరిన టీఎంసీ అసంతృప్త ఎమ్మెల్యే గోస్వామి

Trinamool MLA Mihir Goswami Joins BJP
  • బెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
  • పార్టీ ప్రారంభం నుంచి టీఎంసీలోనే ఉన్న మిహిర్ గోస్వామి
  • పార్టీలో తనకు అవమానం జరిగిందన్న ఎమ్మెల్యే
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఎంపీ నిసిత్ ప్రమాణిక్‌తో కలిసి ఢిల్లీ వచ్చిన గోస్వామి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా గోస్వామి మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమత బెనర్జీకి పంపినట్టు తెలిపారు. టీఎంసీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని, పార్టీలో తనను అవమానించారని ఆరోపించారు. కాగా, టీఎంసీ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి అందులోనే ఉన్న గోస్వామి కాషాయ పార్టీ జెండా పుచ్చుకోవడం  టీఎంసీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.
West Bengal
Trinamool congress
BJP
Mamata Banerjee

More Telugu News