Roja: సీఎం జగన్ తీసుకున్న చర్యల వల్లే తుపాన్ ముప్పు నుంచి తప్పించుకున్నాం: రోజా
- సీఎం కార్యాచరణపై ప్రశంసలు
- మరో రెండు తుపానులు వస్తున్నాయి
- రానున్న తుపాన్లపై జగన్ సమీక్ష జరుపుతున్నారు
నివర్ తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తిరుమలలో సైతం తీవ్ర వర్షంతో భక్తులకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణపై ప్రశంసలు కురిపించారు. జగన్ తీసుకున్న చర్యల వల్లే అతిపెద్ద తుపాను విపత్తు నుంచి ప్రజలు తప్పించకోగలిగారని అన్నారు.
రానున్న రోజుల్లో మరో రెండు తుపానులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న తుపాన్లపై సీఎం సమీక్ష జరుపుతున్నారని చెప్పారు. వరద బాధిత ప్రాంతాలను సీఎం ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారని తెలిపారు. వర్షాల వల్ల పంటను నష్టపోయిన రైతులకు డిసెంబర్ 31లోగా నష్టపరిహారం ఇస్తారని, రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు జమ అవుతుందని చెప్పారు. వరద నష్ట పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామని తెలిపారు.