Corona Virus: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్ అవసరం లేదు: ఫైజర్ మాజీ ఉపాధ్యక్షుడు
- వైరస్ ముప్పు లేని వారికి టీకా ఇవ్వక్కర్లేదు
- విస్తృత పరీక్షలు నిర్వహించకుండానే ఆరోగ్యవంతులకు ఎలా ఇస్తారు.
- దాదాపు సగం కేసులు, మరణాలు నాలుగు దేశాల్లోనే..
కరోనా టీకా కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ, వైరస్ అంతానికి అసలు టీకానే అవసరం లేదని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మైఖేల్ ఈడన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ మాజీ ఉపాధ్యక్షుడైన మైఖేల్ తాజాగా మాట్లాడుతూ.. వైరస్ ముప్పు లేని ప్రజలకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ ఆలోచన సరికాదని పేర్కొన్నారు. విస్తృత పరీక్షలు నిర్వహించకుండానే ఆరోగ్యవంతులైన కోట్లాదిమందికి టీకా ఇవ్వాలన్న ప్రభుత్వాల నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
నిజానికి కరోనా పరీక్షలను శరవేగంగా చేసిన దేశాల్లో మహమ్మారి చాలా సులభంగానే అదుపులోకి వచ్చిందని చెప్పారు. కరోనా కేసులు, మరణాల్లో దాదాపు సగం నాలుగు దేశాల్లో నమోదైనవేనన్న ఆయన.. 70 శాతం కేసులు, మరణాలు పది దేశాల్లోనే నమోదవుతున్న సంగతిని గుర్తెరగాలని సూచించారు.