england: భారత్ క్రికెట్ జట్టు ఆటతీరుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ విమర్శలు
- ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేదు
- టీమిండియాకు ఆరు లేక ఏడుగురు బౌలర్లు ఉండాలి
- బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేదు
- ప్రపంచకప్ గెలుస్తుందని నేను అనుకోవడం లేదు
భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు ఆటతీరు, జట్టు కూర్పుపై ఆయన తాజాగా మాట్లాడుతూ... ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేకపోవడమే టీమిండియాకు ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. టీమిండియాకు ఆరు లేక ఏడుగురు బౌలర్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, టీమిండియా బ్యాటింగ్ తీరుపై మైఖేల్ వాన్ విమర్శలు గుప్పించడం గమనార్హం. బ్యాటింగ్ లైనప్‌లో లోతు లేకపోవడం టీమిండియాలో సమస్యగా ఉంది అన్నారు. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుతం టీమిండియాలో ఉన్న కూర్పుతో భారత జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. భారత్‌లో ఐపీఎల్‌ను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారని, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేయగలిగే ఇద్దరు ఆటగాళ్లు లేక ఓ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు.