Bandi Sanjay: కవితపై అనర్హత వేటు వేయాలని సీఈసీకి లేఖ రాశాం: బండి సంజయ్

We complained CEC about Kavithas voting says Bandi Sanjay

  • టీఆర్ఎస్, ఎంఐఎంల అరాచకాలపై మోదీకి వివరించా
  • మోదీ అభినందనలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి
  • ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయొచ్చా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన తీరు గురించి ప్రధాని మోదీ ఫోన్ చేసి తెలుసుకున్నారని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అరాచకాలపై ప్రధానికి వివరించానని చెప్పారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తమ పనితీరును మోదీ ప్రశంసించారని తెలిపారు.

మోదీ అభినందనలు తమ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాదులో కూడా ఓటు వేయడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయొచ్చా? అని ప్రశ్నించారు. కవితపై అనర్హత వేటు వేయాలని సీఈసీని కోరామని చెప్పారు.

మరోవైపు కవిత రెండు ఓట్లపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. బోధన్ లో ఓటును కవిత రద్దు చేసుకున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News