State Election Commission: తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేస్తున్న ఎస్ఈసీ

SEC  to files review petition

  • ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు 
  • అభ్యంతరాలు తెలిపిన ఎస్ఈసీ
  • హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్  

జీహెచ్ఎంసీ బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు వున్నా చెల్లిన ఓటుగానే పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేయడం, ఆ సర్క్యులర్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

అయితే, ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసి, స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని ఈ రోజు ఉదయం ఆదేశించింది. ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవద్దని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News