Bharat Biotech: భారత్ బయోటెక్ ను సందర్శించనున్న 80 దేశాల ప్రతినిధులు

Foreign delegation to visit Bharat Biotech in Hyderabad

  • కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్
  • విదేశీ రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాద్ రాక
  • ఏర్పాట్లు చేస్తున్నామన్న సీఎస్

కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధిలో దూసుకుపోతుతున్న దేశీయ సంస్థ భారత్ బయోటెక్ పేరు ఇప్పుడు అంతర్జాతీయస్థాయికి చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు ఇస్తుండడం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రాన్ని 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు సందర్శించనున్నారు. భారత్ బయోటెక్ క్యాంపస్ లో కొవాగ్జిన్ పరిశోధనలను పరిశీలించనున్నారు. వీరంతా ఈ నెల 9న హైదరాబాద్ వస్తున్నారు.

విదేశీ ప్రముఖులు వస్తుండడంతో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సీనియర్ అధికారులతో పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. విదేశీ ప్రతినిధుల పర్యటనకు ప్రోటోకాల్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ప్రత్యేక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వారికి వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో హైదరాబాదు ప్రత్యేకతను వివరిస్తామని అన్నారు. ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ వివరాలతో ప్రజంటేషన్ తయారుచేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News