WHO: ఇక కరోనా సంక్షోభం ముగుస్తుందని భావించొచ్చు!: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

who on vaccine distribution

  • వ్యాక్సిన్‌ విషయంలో ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించకూడదు 
  • వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలి
  • కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం కలగాలి
  • నేను కూడా టీకా తీసుకుంటాను

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం కరోనాకు ముగింపు పలికే కలలు కనే సమయం వచ్చేసిందని అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో కరోనా సంక్షోభం తగ్గే అవకాశం ఉందని, అయితే, వ్యాక్సిన్‌ విషయంలో పేద, మధ్య ఆదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించకూడదని అధనామ్‌ పేర్కొన్నారు. కరోనా ముగింపుకు సమయం దగ్గరపడినప్పటికీ, ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా సంక్షోభం ముగియగానే ప్రతిదేశం పేదరికం, ఆకలి బాధలు, వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై దృష్టి సారించాలని చెప్పారు. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని తెలిపారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు, దాన్ని ప్రచారం చేసేందుకు తాను కూడా టీకా తీసుకుంటానని ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తో పాటు ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ. బుష్‌, బిల్‌ క్లింటన్‌ కూడా వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు టీకాను బహిరంగంగా తీసుకుంటామని తెలిపిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News