Vijay Sai Reddy: వైజాగ్ లో రూ.2,500 కోట్ల పెట్టుబడికి భూమి వరల్డ్ గ్రూప్ ఆసక్తి చూపుతోంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy saya another huge investment comes to state
  • రాష్ట్రానికి మరో పెట్టుబడి వస్తోందన్న విజయసాయిరెడ్డి
  • 20 వేల మందికి ఉపాధి కలుగుతుందని వెల్లడి
  • ఇదే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్యలు
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. వైజాగ్ లో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు భూమి వరల్డ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. దీని ద్వారా 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత 100 ఎకరాల పార్కు అన్ని మౌలిక వసతులతో సిద్ధంగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను తనదైన శైలిలో ఆకాశానికెత్తేశారు. నిజమైన నేత, నిజమైన పెట్టుబడి కలిస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Bhoomi World Group
Investment
MSME Park
Vizag

More Telugu News