Bonda Uma: ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్: బోండా ఉమ

ec decision only final bonda uma

  • ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాలంటే వైసీపీ భయపడిపోతోంది
  • నిమ్మగడ్డను పనికిరాని వాళ్లు బూతులు తిడుతున్నారు
  • వైసీపీకి నిజంగా ప్రజల నుంచి మద్దతు ఉంటే భయపడదు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుండగా, అందుకు ఏపీ సర్కారు అంగీకరించట్లేదన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ  నేత బోండా ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపడానికి వైసీపీ భయపడిపోతోందని అన్నారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారు అంగీకారం తెలిపినా, తెలపకపోయినా  ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను పనికిరాని వాళ్లు బూతులు తిడుతున్నారని ఆయన అన్నారు. ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ వెళ్లిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమదే విజయం అని వైసీపీ నేతలు అంటున్నారని చెప్పారు. వైసీపీకి నిజంగా ఏపీ ప్రజల నుంచి మద్దతు ఉంటే స్థానిక ఎన్నికల నిర్వహణపై భయపడదని అన్నారు.

  • Loading...

More Telugu News