Sensex: కొనుగోళ్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 347 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 97 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన ఓఎన్జీసీ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐసీఐఐసీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ తదితర బ్లూ చిప్ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మదుపరులు మొగ్గుచూపడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు లాభపడి 45,427కి పెరిగింది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 13,356కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.28%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.95%), ఐటీసీ (2.78%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.58%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.39%), నెస్లే ఇండియా (-1.36%), టాటా స్టీల్ (-1.14%), బజాజ్ ఫైనాన్స్ (-1.11%), మారుతి సుజుకి (-0.76%).