CPI Ramakrishna: చివరికి ఈ ప్రభుత్వం రైతులపై రాళ్లు వేయించే స్థితికి వచ్చింది: జగన్ సర్కారుపై 'సీపీఐ' రామకృష్ణ విమర్శలు
- ఏ పోరాటం కూడా 12 నెలలు జరగలేదన్న రామకృష్ణ
- అమరావతి పోరు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడి
- సీఎం అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- భారత్ బంద్ కు అమరావతి రైతులు మద్దతివ్వాలని సూచన
రాజధాని అమరావతిలో జరుగుతున్న ఉద్యమంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్రంలో ఏ పోరాటం కూడా 12 నెలలు జరగలేదని, అమరావతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అయితే, ఈ ప్రభుత్వం చివరికి రైతులపై రాళ్లు వేయించే స్థితికి వచ్చిందని విమర్శించారు. అమరావతి ఉద్యమంపై సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ బంద్ కు అమరావతి రైతులు మద్దతు ప్రకటించాలని రామకృష్ణ కోరారు.
అటు, టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందిస్తూ.... ప్రపంచంలో ఏ దేశ రైతులు ఇన్ని భూములు ఇవ్వలేదని అన్నారు. ఉద్యమంలో రైతుల కన్నీళ్లు, రక్తం వృథాగా పోవు అని పేర్కొన్నారు. అమరావతిపై వైసీపీ మంత్రుల అసత్య ప్రచారాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు పెంచుకునేందుకే విశాఖకు రాజధాని తరలిస్తున్నారని ఆరోపించారు.