Amit Shah: రంగంలోకి దిగిన అమిత్ షా.. చర్చల కోసం రైతులకు ఆహ్వానం
- వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న ఆందోళనలు
- రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు విఫలం
- సాయంత్రం 7 గంటలకు రైతులతో అమిత్ షా చర్చలు
కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు భారత్ బంద్ చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు రైతు నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతులతో చర్చలకు సిద్ధమయ్యారు.
చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్టు రైతు నేత రాకేశ్ తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని... చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రాకేశ్ చెప్పారు. సాయంత్రం 7 గంటలకు సమావేశం జరగనుందని తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు.