Sandra Venkata Veeraiah: ఓటుకు నోటు కేసు.. సండ్ర వెంకట వీరయ్యకు నిరాశ!

TS HC rejects Sandra Venkata Veeraiahs petition in vote for note case
  • కేసు నుంచి తనను తొలగించాలని సండ్ర పిటిషన్
  • ఆయన డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
  • హాజరు మినహాయింపు పిటిషన్లను అనుమతించబోమన్న ఏసీబీ కోర్టు
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆయన వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. 15వ తేదీన జరిగే తదుపరి విచారణకు అందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇకపై హాజరు మినహాయింపు కోసం వేసే పిటిషన్లను అనుమతించబోమని కోర్టు తెలిపింది.
Sandra Venkata Veeraiah
Vote for Note Case
TS High Court

More Telugu News